బంగారుతల్లి కబుర్లు

జూన్ 18, 2010

మా ఇంతి లివ్యూ

Filed under: కుటుంబం — బంగారుతల్లి @ 4:05 సా.

నాన్నాలు ఈమధ్య చాలా హడావుడిగా ఉన్నాలు.  పెందలాడే తయాలయి ఆఫీసుకెళ్ళిపోయి, లాత్లి ఎప్పుడో నేను బజ్జున్నాకా వస్తున్నాలు.  ఎందుకా అని అమ్మనడిగానా.  వాళ్ళాఫీసులోవాళ్ళందరినీ ప్పది నెల్లకో డెబ్బయ్ లోజులకో ఒకసాలి కూల్చోబెత్తి, ఈ పని బాగా చేసాలూ, అది బాగా చేయలేదూ అని ప్రైవేతు చెప్పుతాలుత.   ప్లతీ ఏడాదీ ఈనెలలోనే ఆ పని చేస్తాలుత.  నాన్నాలు చాలామందికి ప్రైవేతు చెప్పాలిత. అందుకే అంత బిజీ.

నాకీ పద్ధతి నచ్చేసింది.  బాగాచేసినపన్లు చెప్తే వాళ్ళు సంతోషిస్తాలు కదా.  అలాగే ఇంకా ఏవి బాగాచెయ్యాలో చెప్తే అలానే చేస్తాలు కూడాను.  “తప్పమ్మా.  అల్లా అస్తమానూ నోత్లో వేళ్ళు పెత్తుకోకూడదు. బంగాలుతల్లి కదూ”, అని బామ్మగాలు చెప్పగానే నేను మానేసానా లేదా.  అలా అన్నమాత.

పైగా రంగనాయకమ్మగారి స్వీత్ హోం కూడా చదివేస్తున్నాను

పైగా రంగనాయకమ్మగారి స్వీత్ హోం కూడా చదివేస్తున్నాను

సలే మలి.  నేను కూడా పుత్తి చ్చాలా లోజులాయింది కదా.  అప్పుడే బోల్లా పడిపోయానని బొబ్బత్లుపంచిపెత్తాలు.  చిలకపలుకులు లావాలని పంచదాల చిలకలు కూడా పంచిపెత్తాలు.  నేనేమో అప్పుడే నడిచేస్తున్నాను (అదేలే, నాన్నాలి మాతల్లో పాకడం).  పైగా రంగనాయకమ్మగారి స్వీత్ హోం కూడా చదివేస్తున్నాను (పాపాయి, వాళ్ళన్న లవి కథలంతే నాకు ఇష్తంలే).  అంతే కుంచెం పెద్దదాన్నవుతున్నత్తేకదా.  కాబత్తి, మావాళ్ళ పనుల మీద నేనుకూడా నా ఆలోచనల్ని చెప్పేదా?

మొదతగా అమ్మ.  అమ్మగులించి ఎంతచెప్పినా తక్కువే.  అమ్మ అమ్మేకదా.  నాకు బోళ్డు సేవలు చేస్తుంది.  ఎప్పుడూను. అదీ ప్లేమగానే.  నాతోనే ఉందామని చూస్తుంది.  నేనేంచేసినా విసుక్కోదు.  ఆఖలికి నేను విసుక్కున్నా కూడా,  ముద్దుముద్దుగా చూసుకుంతుంది.  ఏడో, డెబ్బయ్యో బత్తలు కొంతుంది.  నన్నెవలైనా పొగిడితే వాళ్ళని కూడా మెచ్చేసుకుంతుంది.  అందుకే నాకు అమ్మంతే చాలా ఇష్తం.  కానీ అప్పుడప్పుడు కుంచెం కోపం కూడా.  నాన్నాలితో నేను పిచ్చిఆతలు ఆడతానా.  పిచ్చిఆతలంతే అమ్మకి తెలీని ఆతలులే.  పైకి గాల్లో ఎగలడం, తలమీంచి బోల్లాపడ్డంలాంతివన్నమాత.  అప్పుడు విసులుగా వచ్చి నాన్నాలికి బాగా ప్రైవేతు చెప్పుతుంది.  నాకిష్తమని తెలుసుకోదే.  ఆ విషయంలో కుంచెం మాలితే బాగుంతుంది.

తల్వాత నాన్నాలు.  నాన్నాలి గులించి తల్చుకుంతేనే నవ్వొచ్చేస్తుంది.  కితకితలు పెత్తేత్తాలు.  కిందామీదా తోసేస్తాలు.  గెడ్డంతో బాగా గాఠిగా ముద్దులు పెత్తేసుకుంతాలు.  కుంచెం నెప్పెత్తినా బలేఉంతుందిలే.  బోళ్డు బొమ్మలు కొనితెస్తాలు.  నాకు లోజూ బొబ్బపోస్తాలు.  నన్ను నీళ్ళల్లో ఆడుకోనిస్తాలు.  అబ్బో, ఇలా చాలా చాలా.  అందుకే నాన్నాలిని చూస్తే చాలా హుషాలు.  కానీ, బొబ్బపోసుకున్నాకా బజ్జుంతానే. అప్పులు మాయమయి మళ్ళీ ఎప్పుడో లాత్లికొస్తాలు.  అమ్మలా ఎప్పుడూ నాతోనే ఉండిపోవచ్చుకదమ్మా.  ఎందుకో ఈ ఆఫీసూ, గీఫీసూ.

బామ్మగాలి పక్కమీద ఆడుకుంతున్నాను

బామ్మగాలి పక్కమీద ఆడుకుంతున్నాను

ఇప్పులు బామ్మగాలు-తాతగాలు.  అదేంతో, బామ్మాలితో ఎంతసేపు ఆడుకున్నా విసుగనేదేలాదు.  కొత్తకొత్తవన్నీ చూపిస్తాలు, బొమ్మలు కొనిస్తాలు.  జేజిమీద పద్యాలు చదువుతాలు. పాతలు కూడా పాడతాలు.  ఎంత బ్బావుంతాయో.  ఎప్పుడు పెద్దయిపోదామా, నేనుకూడా పద్యాలూ, పాతలూ పాడేయొచ్చూ అనిపిస్తుందనుకో.  మలి తాతగాలేమో నాకోసం చూసీ, చూసీ, ఎంతకీ నేను లావత్లేదని, జేజిదగ్గలకెళ్ళిపోయాలుత.  నాగులించి ఎంతగానో అనుకునేవాలుత.  నన్ను బాగా పెంచుదామనికూడా అనుకున్నాలుత.  మలి అంత తొందలెందుకో తెలీదు.  ఇంకొన్నాళ్ళుండి వెళ్ళొచ్చుకదా.  జేజి కూడా మంచివాడేకదా.  బంగాలుతల్లిదగ్గలున్నాను అని చెప్పేస్తే సలి.  కోపంకూడా పడడుకదా. ఏంతో మలి!

తల్వాత అమ్మమ్మ-తాతగాలు.  వాళ్ళకి నేనంతే ప్లాణంత.  తాతగాలేమో నన్ను లోజూ ఎత్తుకుని బజ్జునేదాకా షికాలు తిప్పుతాలు.  అప్పుడు నాకు బలేబాంతుందనుకో.  నాకోసం అన్ని సామానూ బజాలునించి తెస్తాలు.  ఖుషీ అని ముమ్ముద్దుగా పిలుస్తాలు.  అమ్మమ్మేమో ఇక్కడ ఉన్నన్నాళ్ళూ నాకు బొబ్బపోసి, సాంబ్లాణీ వేసి, నన్నంటే తిలుగుతుంది.  కొత్తకొత్త బత్తలూ అవీ తెస్తుంది. ఆంఆం పెడ్తుంది. కుసుమహలా, కుసుమప్లియా అంతూ ఏవో పేల్లతో పిలుస్తుంది.  అవికూడా జేజి పేల్లేనని అమ్మచెప్పిందిలే.  చాలా బాగా చూసుకుంతుందిలే.  అందుకే అమ్మమ్మ తాతగాలు అంతే చాలా ఇష్తం.  ఎప్పుడెప్పుడొస్తాలా అని ఎదులుచూస్తూంతాను.

అవీ నా ఆలోచన్లు.  అమ్మనాన్నాలిమీదా తప్ప ఇంకెవలిలోనూ ఏం మారితే బావుంతుందో చెప్పలేదంతాలా.  అమ్మానాన్నాలు అంతే బాగా చనువుకదా.  ఏమన్నా పల్లేదు.  అదీకాక మనమీద ప్లేమ చూపించేవాళ్ళమీద ఇష్తంగానే ఉండాలి గానీ, వాళ్ళమనసు కష్తపెత్తకూడదూ అని చెప్పాలులే నాన్నాలు. అందుకన్నమాత.

5 వ్యాఖ్యలు »

 1. బంగారు తల్లి అప్పుడే బోర్లాపడిపోతుందా… భలే చెప్తున్నారు అచ్చం తన మనసును చదివేసినట్లు

  వ్యాఖ్య ద్వారా nestam — జూన్ 18, 2010 @ 7:23 సా. | స్పందించండి

 2. బంగారు తల్లీ, నీ పిలకా, గాజులూ super…భలేగా ready అయ్యావే

  వ్యాఖ్య ద్వారా స్ఫురిత — జూన్ 18, 2010 @ 11:47 సా. | స్పందించండి

 3. బంగారుతల్లీ! నాన్నాలికి Happy Fathers Day చెప్పు.

  వ్యాఖ్య ద్వారా నిహారిక — జూన్ 20, 2010 @ 1:40 సా. | స్పందించండి

 4. అరె… ఎంత ముద్దొస్తుందో… ఆ పిలక, గాజులు, అమాయకపు చూపులు… నిజంగా బంగారు తల్లే 🙂
  ఇవాళ్ళ బ్లాగు రాయడం అయ్యాక మరచిపోకుండా దిష్టి తీయమని అమ్మకు చెప్పు. సరేనా.

  వ్యాఖ్య ద్వారా అయినవోలు ప్రణవ్ — జూన్ 28, 2010 @ 6:49 సా. | స్పందించండి

 5. ఎంట్రా బంగారుతల్లి …అటల్తొ బిజిగా వున్నావా… కబుర్లు చెప్పడానికి రావడం లేదు

  వ్యాఖ్య ద్వారా మంచు — జూన్ 30, 2010 @ 10:45 ఉద. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

%d bloggers like this: