నన్ను నాన్నాలు “బంగాలు తల్లీ” అంతాలు. అమ్మేమో “కుషీ” అని పిలుత్తుంది. మలి నేను పుత్తి కొన్నాల్లే ఐందా? అంతే ఫ్ఫది రోజులో, ఆలు నెల్లో నన్నమాత! నాన్నాలేమో నన్ను కబుల్లు చెప్పూ అన్నాలు. మలి మొదలెడదామా?
నాన్నాలిది కోనసీమ. అమ్మది బెజవాడ. మరి నేనేమో బెంగులూలులో పుత్తానుత – బామ్మగాలు చెప్పాలు. అలా ఎందుకని అడిగానా, బోల్డు కథ చెప్పారు.
నాన్నాలు నాఅంత ఉన్నప్పుడు మాఊళ్ళో ఉండేవాలు. మరి క్కొంచెం పెద్దయ్యాక లండన్ వెళ్ళాలు కదా. అమ్మేమో అప్పులే పేద్దపేద్ద చదువులన్నీ చదివేసిందత. అప్పులేమో అత్తా, బామ్మగాలు, తాతగాలు విజ్జెవాడలో అమ్మని చూసాలుత. అత్తకి అమ్మ బాగా నచ్చేసి, నాన్నాలికి చెప్పేసిందిత. నాన్నాలేమో అమ్మకి ఫోన్ చేసి, “మా బంగాలు తల్లికి అమ్మగా వుంటావా?” అని అడిగేసాలుత. అమ్మ సిగ్గుపడిపోయి సరే అనేసిందిత. అప్పులేకదా, పెళ్ళయిపోయింది!
నాన్నాలు అప్పులు బెంగలూలు వచ్చేసాలన్నమాత. అమ్మకేమో బెజవాడలో ఎండలకన్నాఇక్కడ చలి నచ్చిందిత. అందుకే నాన్నాలితో చెప్పి, మా ఇల్లు కొనేసాలుత. కొన్నాల్లయ్యాక, నేను పుత్తానుత. అదీ బామ్మగాలు చెప్పిన కత.
తాతగాలు బామ్మగాలిని “జానకీ” అని పిలిచేవాలుత. అమ్మచెప్పింది. ఇప్పులు మరి తాతగాలు జేజి దగ్గలున్నాలు కదా. బామ్మగాలి పేలు కూడా నాకు పెట్టాలు కదా! అందుకే బామ్మగాలు నన్ను “జానకీ” అని పిలుత్తాలు. అంతే, తాతగాలు పిలిచినత్తన్నమాత. ఇప్పులేమో, “జానకీ, రాత్రయిందమ్మా. బజ్జోలా పండూ” అన్నాలు. మలి నాకు నిద్ర వస్తోంది కదా. మల్లీ కలుద్దామే!
అమ్మ, నాన్నాలు, నేను (నాకు పేలు పెత్తినప్పతి ఫోతో)
Nice Family.
వ్యాఖ్య ద్వారా Rakesh — డిసెంబర్ 4, 2011 @ 4:04 సా. |