నాన్నాలికి నిన్న ఏమయిందో. కాసేపు తీవీ చూసాలు. కాసేపు పుస్తకం చదివాలు. కాసేపేమో ఏవో ఆతలాడుకున్నాలు. మలి కాసేపు ఏదో లాసుకున్నాలు. మళ్ళీ పైకి చూస్తూ, కిందపడుకొని కాసేపు కళ్ళుమూసుకున్నాలు.
అమ్మనడిగానా. విసుగ్గా వుందిత నాన్నాలికి.
ఏంతో బాబూ, ఈ పెద్దాళ్ళకి బొత్తిగా కుదులు లేదు. ఏపనైనా కుంచెం ఎక్కువసేపు చెయ్యలేలు. నన్ను చూడండి. నాకు ఈమధ్యనే నడవడం వచ్చిందా. అది నడవడం కాదు, పాకడం అంతాలు నాన్నాలు. ఎందుక్కాదూ, నడవడం అంతే ఏమితీ అన్నానా. ఒకచోత నించి ఇంకొకచోతకి వెళ్ళడం అన్నాలు. మలి నేను చేస్తున్నదీ అదేకదా. కానీ ఒప్పుకోలు. అది పాకడమే అంతాలు. ఈ పెద్దాళ్ళంతా ఇంతే. ప్లతీ పనికీ ఇలవైయ్యో, వందో పేల్లు పెడతాలు.
సలేలే. ఇంతకీ ఏం చెప్తున్నాను? ఆ.. నేను ఈమధ్య నడిచేస్తున్నానా. అందుకని పని చేసుకునేతప్పుడు, అమ్మ నన్ను బజ్జోపెత్తి, చుత్తూ కోత కత్తేది. కోత అంతే పెద్దపెద్ద తలగడలు చుత్తూ పెత్తి, మన్ని మధ్యలో పడేయడం అన్నమాత. మలి నేనూ పెద్దదాన్నవుతున్నాకదా. అందుకే ఆ కోత కూలగొత్తేసి, మామంచంమీంచి కిందకి కూడా నడిచేయబోయాను. అప్పులు అమ్మ భయపడిపోయి, నాన్నాలికి చెప్పి మంచం మాయం చేయించేసింది. నాన్నాలికి బోళ్ళు మాయలొచ్చులే.
ఇప్పులు పక్క కిందే ఉంది కదా, నేలమీద. అందుకనో ఏమో, అమ్మ కోత కత్తడం మానేసింది. అప్పులు మనకి ఇంకా బాగా నడకొచ్చేసి, నేలమీద నడిచేస్తానా. నీళ్ళగది దగ్గల గుడ్డ బలే లంగుల్లో ఉంతుంది. అందలూ కాళ్ళు తుడుచుకుంతాలులే. కానీ ఎవ్వలూ దానితో కబుల్లే చెప్పలు. అందుకని పాపం జాలిపడి దాని దగ్గలకి నడిచేస్తానా. ఇంతలో ఎక్కణ్ణుంచో హఠాత్తుగా నాన్నాలో, అమ్మో, బామ్మగాలో వచ్చేసి, మన్ని మళ్ళీ పక్కమీదకి తెచ్చేస్తాలు. ఖష్తపడి ఇంత దూలం నడిచిందే పాపాయి, పోనీలే కాస్తసేపు కబుల్లు చెప్పుకోనీ అనుకోచ్చుగా. ఊహు.
ఈలోగా, ఆ పక్కన అద్దం దగ్గల చిన్నగా, నల్లగా ఏదో కనబడుతుందా. అంతే మనకే కనబడుతుందిలే. పెద్దాళ్ళకు కాదు. వెంఠనే, అతు నడిచేస్తాను. నాన్నాలేమో మన్ని పక్కమీదే పడుకోబెత్తాంలే అని అతుపక్కన కూచుని పేపలు చదువుకుంతూ ఉంతాలు. ఏదో అనుమానంవచ్చి తలెత్తి చూసేసలికి నేను ఆ నల్లదానిదగ్గలుంతాను కదా. అదేమో (అంతే దాని పేలు నాకు తెలీదులే) భయపడిపోయి నన్నెక్కడైనా దాచెయ్యీ అంతుందా. సలేపాపం అని, నానోత్లో దాద్దామని అనుకుంతూండగానే నాన్నాలు వచ్చేసి హడావుడి పడిపోతాలు. నన్నెత్తేసుకుని, నాచేతిలోచి ఆ నల్లది లాగేసుకుని, బయతకు విసిలేసి, నన్ను మళ్ళీ పక్కమీదకు చేర్చేస్తాలు. విసుగొచ్చేస్తుందనుకో.
అయినా పర్లేదు. చుత్తూచూస్తే ఏదో ఒకతి మన్ని పిలవకపోతుందా అని చూస్తాను. పిలిస్తే, మళ్ళీ నడిచేస్తాను. అదన్నమాత. కుదులుగా ఒక పని చేయడం.
ఇష్తమైనపని చేస్తే, విసుగెందుకొస్తుందో, నాకయితే ఇప్పతికీ తెలీదు. అది తెలియాలంతే పెద్దవ్వాలేమో!
నీకెన్ని కత్తాలో మా ఇంటికి వచ్చేయి నడుతుకుంతు ….. నువ్వు నేను అలుకుందాం
వ్యాఖ్య ద్వారా శ్రీనివాస్ — జూన్ 8, 2010 @ 6:13 సా. |
సీగానపెసూనాంబా, బుడుగు, చిత్తి, పొత్తి, ఇస్కాన్ చిన్నాలి క్లిష్షుడూ కూడా వస్తాలు మలి. సలేనా?
వ్యాఖ్య ద్వారా బంగారుతల్లి — జూన్ 9, 2010 @ 3:38 సా. |
U r so cute:)
వ్యాఖ్య ద్వారా padmarpita — జూన్ 8, 2010 @ 10:36 సా. |
థాంక్యూ అండీ. నాన్నాలు కూడా నన్నదే అంతాలు.
వ్యాఖ్య ద్వారా బంగారుతల్లి — జూన్ 9, 2010 @ 3:39 సా. |
బంగారుతల్లి… బంగారుతల్లి కబుర్లు రెండూ సో క్యూట్..
వ్యాఖ్య ద్వారా మంచు — జూన్ 9, 2010 @ 3:36 ఉద. |
థాంక్యూ. మీకు నచ్చినందుకు సంతోషం.
వ్యాఖ్య ద్వారా బంగారుతల్లి — జూన్ 9, 2010 @ 3:15 సా. |
మా పెద్దోళ్ళకంటే నీకే బోలెడు మంచి విషయాలు తెలుసమ్మా బంగారు తల్లీ.. ఇలాగే కబుర్లు చెబుతూ ఉండు. 🙂
వ్యాఖ్య ద్వారా మధురవాణి — జూన్ 9, 2010 @ 1:47 సా. |
సలేనండీ. మీకు నా కబుల్లు నచ్చినందుకు సంతోషం.
వ్యాఖ్య ద్వారా బంగారుతల్లి — జూన్ 9, 2010 @ 3:13 సా. |