బంగారుతల్లి కబుర్లు

జూన్ 30, 2010

ముత్తాతగాలింత్లో నిజ్జం ఆంఆం

Filed under: కుటుంబం — బంగారుతల్లి @ 2:13 సా.

పెద్దదాన్నయ్యానుగా .. అందుకే ఈ స్టైల్

పెద్దదాన్నయ్యానుగా .. అందుకే ఈ స్టైల్

వచ్చే సోమవాలం నేను నిజ్జం ఆంఆం తింతున్నానుకదా.  అంతే, ఇప్పతివలకూ లాగిపిండి, అలతిపళ్ళు, బత్తాయిలూ తింతూనే ఉన్నా, అన్నం, పప్పూ, కూలా ఇంకా తినత్లేదన్నమాత.  పెద్దాళ్ళంతా అవే తింతాలుకదా.  అంతే అవి తింతే పెద్దయ్యిపోయినత్తే.  అందుకే నేను పెద్దయ్యిపోయాను అని అలిచి చెప్పినా ఎవలూ వినిపించుకోలేదా.  మలి ఇప్పుడు ఎవలో పంతులుగాలు చెప్పాలని, వచ్చే సోమవాలం నాకు నిజ్జం ఆంఆం పెడ్దామని నాన్నాలు అన్నాలు.  నా మాత విన్లేదని కుంచెం ఖోపమొచ్చిందనుకో.  కానీ, చివలికి వాళ్ళకి నా గులించి తెలిసిపోయిందని ఆనందపడ్డాలే.

ఇవాళ నాకో కొత్తపేలు తెలిసింది.  ముత్తాతగాలుత.  అంతే అమ్మావాళ్ళ తాతగాలుత.  అబ్బో.  చాలా పెద్దాయనత.  అంతే నాకన్నా లెండో, ప్పదో యేళ్ళు పెద్దన్నమాత.  నాన్నాలికన్నా కూడా పెద్దే.  ఆయన బెజవాడలో ఉన్నాలుత.  బెజవాడంతే తెలుసుగా.  అమ్మావాళ్ళ ఊలు.  నేనేమో బెంగుళూలులో పుత్తేసాను కదా.  అందుకే నా బాలసాల ఇక్కడే చేసాలు.  అప్పులు అమ్మమ్మ “అయితే అన్నప్లాసన బెజవాడలో చేద్దామే” అంది కదా.  ఈ పెద్దాళ్ళు ఒక్కో మాతకీ ప్పది రకాలుగా చెప్తే, మాలాంతి చిన్నపిల్లలకెలా తెలుస్తుంది?  ఆంఆం అనొచ్చుగా.  మళ్ళీదానికో కొత్త పేలు.  అన్నప్లాసన అని.  చూడండి.  ఎంత ఖష్తంగా ఉందో పలకడానికి.

ఇస్కాన్ క్లిష్ణుడూ, నేనూను

ఇస్కాన్ క్లిష్ణుడూ, నేనూను

సలేలే.  ఏం చెప్తున్నాను.  ఆ.  అల్లా నాకు ఆంఆం బెజవాడలో ముత్తాతగాలిదగ్గల జలిపించాలని అనుకుంతున్నాలు.  మలి నీకు ఓకేనా, బంగాలుతల్లీ అని నాన్నగాలు అడిగినప్పుడు కుంచెం సిగ్గేసిందనుకో.  బాగా నవ్వేసి ఓకే అని చెప్పేసాను.  అందుకని మేమందలం నిన్నో, లేపో బయల్దేలి బెజవాడ వెళ్తున్నామన్నమాత.

ఇంకో సంగతి.  ఇది అమ్మమ్మ చెప్పమంది.  తను నాలాంతి పిల్లలకి అఆలు చెప్తుందిలే.  అంతే కేవలం అఆలే కాదనుకో.  ఇంకా కొన్ని ఖష్తమైనవి కూడా చెప్తుంది.  అవి చెప్పడం మొదలుపెత్తి పాతికేళ్ళయ్యిందిత (ఇది బాగా గుల్తుపెత్తుకుని చెప్పమంది, ప్పదో, డెబ్బయ్యో కాదుత. సలిగ్గా పాతికేళ్ళుత – అంతే ఎంతో మీకు తెలుసుగా.  నాకు తెలీదులే).  తనకి అమ్మంతే ఎంతిష్తమంతే, అమ్మకి మూడేళ్ళప్పుడు అమ్మతోబాతుగా తనుకూడా స్కూల్లో జేలిపోయింది.  అమ్మకి తనే అఆలు నేల్పిందిత.  అల్లా బోళ్ళంతమంది అమ్మలకి అఆలు చెప్పీచెప్పీ ఇంత పెద్దయ్యిందిత.

కాబత్తి, నాకు ఆంఆం పెత్తే లోజు మీకందలికీ కూడా ఆంఆం పెడతాను, పిలూ, అంది.  పైగా ఆలోజు నాచేత కొత్తకొత్త ఆతలన్నీ ఆడిస్తాలుత.  అవి చూడడానికీ, మధ్యాన్నం ఆంఆం తినడానికీ మీలు తప్పకుండా లావాలి.  పైగా నాన్నాలు పెద్దపెద్దవాళ్ళందలితో మాత్లాడి, ఆలోజు సెలవిప్పించేశాలు కూడాను.  అదేంతోనమ్మా.  భాలత్ బందుత.  శెలవే కాబత్తి మీలు ఇంకుంచెం పెందలాడే వచ్చేసి, ఎంచక్కా లాత్లిదాకా బాగా ఆడుకోవచ్చు.  అన్నత్తు చెప్పడం మలిచేపోయాను.  ఆడుకోడానికి నేనేకాదు, బుడుగూ, సీగానపెసూనాంబా, ఇస్కాన్ క్లిష్ణుడూ, చిత్తీ, పొత్తీ కూడా వస్తున్నాలు.

తప్పకుండా లావాలేం.

తర్వాత పేజీ »

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.