బంగారుతల్లి కబుర్లు

జూన్ 17, 2010

అమ్మకి చేసే సాయాలు

Filed under: కుటుంబం,దినచర్య — బంగారుతల్లి @ 5:04 సా.

పొద్దున్నించి చూస్తానా.  అమ్మ పాపం బోళ్డు పని చేసేస్తుంది.  లాత్లంతా పక్కంతా తిలిగేస్తూ పడుకుంతాకదా.  పాపం అమ్మకి సలిగ్గా నిద్లే పత్తదు.  అయినా మా జేజి వస్తాడని పొద్దున్నే లేచేస్తుంది.  జేజి అంతే మాకు ఆంఆం వండిపెత్తేవాడన్నమాత.  ఆంఆం జేజి ప్లసాదంతో సమానమని నాన్నాలు చెప్పాలులే.  అప్పుడు, ప్లసాదం వండిపెత్తేది జేజే కదా.  ఆయన పొద్దున్నే వచ్చేస్తాలని, అమ్మ లేచేసి, అందలికీ ఏమేంకావాలో చెప్పేసి, అన్నీ ఇచ్చేసి, మళ్ళీ నా దగ్గలకొచ్చి నన్ను చూసుకుంతుంది.  ఈలోగా నాన్నాలు లేచేసాలని హడావుడి పడిపోతుంది.  ఎందుకో తెలీదు.  చక్కగా నాతో, నాన్నాలితో ఆడుకోచ్చుగా.  ఊహు.

మొన్న కబుల్లు చెప్పినప్పుడు బత్తలు తెల్లగాఎలా చెయ్యాలో చెప్పా కదా (మల్చిపోతే, అమ్మ సినీమా కష్తాలు వినండి).  అది విని నాన్నాలు ఒకతే నవ్వు.  విసుగొచ్చేసిందనుకో.  ఎందుకో చెప్పకుండా ఊలికే నవ్వితే మీకుమాత్లం విసుగులాదా ఏంతి.  ఆ తల్వాత ఎప్పతికో చెప్పాలు.  బత్తలు నీళ్ళగదిలో వేసేస్తే తెల్లగా కావుత.  అక్కణ్ణించి తీసి అమ్మ అదేదో డబ్బాలో వేస్తే, అప్పుడు తెల్లగా అవుతాయిత.  ఇప్పులు ఆ డబ్బా పాడయ్యిందిత.  ప్పదిమందితో మాత్లాడాకా, బత్తలు చేత్తోనే తెల్లగా చేసే అమ్మాయి కుదులుకుందిత.  ఆంఆంచేసిపెత్తే జేజి వెళ్ళేసలికి, ఈ అమ్మాయి వస్తుంది.  అప్పులు మళ్ళీ అమ్మ బిజీ.  బిజీ అంతే బిజీగా ఉండతం. అంతే మీకు తెలుసుగా.  అంతే నాతో మాత్లాడ్డానికి ఖాళీ లేకపోవతం.  అప్పులప్పులు అమ్మే చెప్పుతుంది “ఖుషీ, నేనిప్పుడు బిజీగా ఉన్నానే.  కాసేపత్లో వచ్చి కబుల్లు చెప్తానే” అని.

ఈలోగా, నాన్నాలికి నాతో ఆతలు ఆడీ, ఆడీ మధ్యలో ఏదో గుల్తువచ్చి, నీళ్ళగదిలోకి పాలిపోతాలు.  ఇంక అక్కణ్ణుంచీ పలుగే పలుగు, హడావుడీను.  నాతో జుత్తుపీకించుకోవతం కూడా అవకుండానే లెడీ అయిపోతాలు.  నాన్నాలికి ఆంఆం ఇవ్వాలని మళ్ళీ అమ్మ పలుగు.  అదేంతో నాన్నాలు వేడివేడిగా ఆంఆం తినకుండా, చిన్నచిన్న డబ్బాల్లో పత్తుకెళ్తాలు.  నిన్న చూసేసాలే.  అప్పులు అమ్మమీద చాలా జాలేసేసింది.  అందుకే లేపత్నుంచీ నేనూ అమ్మకి సాయంచేయాలని గత్తిగా అనుకొంతున్నా.

బొమ్మలు విసిలేయకుండా ఆడుకుంతాను

బొమ్మలు విసిలేయకుండా ఆడుకుంతాను

ఒకతి.  పొద్దున్నే లేవను.  నేను లేవకపోతే అమ్మకి నా పనేమీ ఉండదుగా.  అందుకు.

మలోతి.  ఒకవేళ లేచినా, గాఠిగా కళ్ళుమూసేసుకుంతాను.  అప్పులు అమ్మకి నేను లేచినా, తెలీదు.

ఇంకోతి.  పక్కమీదే నడుస్తాను, కింద నడవను.  అప్పులు బత్తలు నల్లగా అవ్వు కదా.

డెబ్భై. నా నవ్వు కోసం ఏమైనా చేయచ్చంతాలు కదా.  అందుకే నాన్నాలు నాదగ్గలున్నప్పులు బాగా నవ్వుతాను.  స్నానానికి పాలిపోవాలని చూస్తే అలుగుతాను.  అప్పులు నాతోనే ఉంతాలు కదా.  అప్పులు అమ్మ హడావుడి పడక్కల్లేదు కదా.  అల్లా నాన్నాలిని మాయచేసేస్తాను.

ప్పది. నా స్నానం నేనే చేస్తాను.  అది చాలా వీజీ.  నీళ్ళగదిలోకెళ్ళడం.  నీళ్ళన్నీ మీద ఒంపేసుకోవడం.  బరాబరా సబ్బు రాసేసుకోవడం.  మళ్ళీ నీళ్ళు పోసేసుకోవడం.  అసలే మనకి నీళ్ళంతే ఎక్కువ ఇష్తం కదా.  కానీ సాంబ్లాణికి మాత్లం అమ్మకావాలేం.  అది చాలా ఖష్తం.  పొగకూడా వస్తుంది.  అప్పుడు ఊపిరాడనత్తుంతుంది కదా.  అందుకు.

ఆలు. నా ఆంఆం నేనే తినేస్తాను.  అమ్మకోసం చూడను, అలవను,

నలభై.  బొమ్మలు విసిలేయకుండా ఆడుకుంతాను.

వంద.  జోలపాత పాడకుండానే నిద్లపోతాను.  అప్పులు అమ్మకి గొంతునెప్పెత్తదు కదా.

అయినా కానీ ఇవన్నీ అమ్మ చేసిపెడితేనే మనకి హాయిగా ఉంతుందనుకో.  కానీ పాపం అమ్మ అలసిపోతోంది కదా.  అందుకే నేను కొంచెం అమ్మకి సాయం చేస్తానన్నమాత.

6 వ్యాఖ్యలు »

 1. బంగాలు తల్లీ…

  నీ సాయాల లిస్ట్ చాలా బాగుంది. ఇప్పట్నుంచే అమ్మకి బోల్డు సాయాలు చేసేస్తన్నావన్నమాట. గుడ్ గాళ్..

  వ్యాఖ్య ద్వారా geetika — జూన్ 17, 2010 @ 7:03 సా. | స్పందించండి

 2. బంగారుతల్లి మా ఊరు ఓసారి రాకూడదు. ముద్దు ముద్దుగా ముద్దొచ్చేస్తున్నావు. ఇక్కడ నీకో ఫ్రెండ్ ఉంది

  వ్యాఖ్య ద్వారా శ్రీవాసుకి — జూన్ 17, 2010 @ 7:27 సా. | స్పందించండి

 3. అబ్బో.. ఎన్ని సాయాలో! ఎంతైనా బంగారు తల్లివి కదూ.. అందుకే ఇంత సాయం చేసేస్తున్నావ్ అమ్మకి. 😀

  వ్యాఖ్య ద్వారా మధురవాణి — జూన్ 17, 2010 @ 8:19 సా. | స్పందించండి

 4. Choooo chweeet ra బంగారు తల్లీ……..చాలా బాగా రాస్తున్నారండి..

  వ్యాఖ్య ద్వారా హంస వాహిని — జూన్ 17, 2010 @ 10:44 సా. | స్పందించండి

 5. అమ్మో ఎన్ని సాయాలో, నీకింత వయసులో ఇంత మంచి గుణం ఉందంటే పెద్దయ్యాక నువ్వు చాలా గొప్పదానివయిపోతవురా తల్లీ….All the best!

  ఇంతకీ ఈ బ్లాగు రాస్తున్నది మీ అమ్మగారా, నాన్నగారా?

  వ్యాఖ్య ద్వారా sowmya — జూన్ 18, 2010 @ 10:25 ఉద. | స్పందించండి

  • @గీతికగాలూ, నా కబుల్లు మీకు నచ్చినందుకు చ్చాలా సంతోషం.

   @శ్లీవాసుకిగాలూ, తప్పకుండా వస్తాను. మలి నాతో సీగానపెసూనాంబా, బుడుగూ, ఇస్కాన్ క్లిష్ణుడూ, చిత్తీ, పొత్తీ కూడా వస్తాలు. అప్పుడు మేమంతా బాగా ఆడుకుంతామన్నమాత. సలేనా?

   @మధులవాణిగాలూ, ఈ బుల్లిబుల్లి సాయాలకే నన్ను చాలా మెచ్చేసుకుఒతున్నాలు. థాంకూ.

   @హంసవాహినిగాలూ, మీకు నా కబుల్లు నచ్చినందుకు ఆనందంగా ఉంది. ఇంకా నాకు బోళ్డు బోళ్డు కబుల్లొచ్చు. అవన్నీ మీకు చెప్తాను.

   @సౌమ్యగాలూ, ఇంకెవలూ – నాన్నాలే. అమ్మకి పాపం పనుల్లోపడి ఖాళీ ఉండదుకదా. అందుకేగా, నేను ఈ సాయాలు చేసేది. అయినా కుంచెం తీలిక చేసుకుని ఫొతోలు అవీ బాగా తీస్తుందిలెండి. మీలు చూసిన ఫొతోలన్నీ అమ్మ తీసినవే కదా.

   వ్యాఖ్య ద్వారా బంగారుతల్లి — జూన్ 18, 2010 @ 11:29 ఉద. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

%d bloggers like this: