మా దాలాగాలంలో లెండు పావులం పిల్లలు పుత్తాయని మొన్న చెప్పానా (మల్చిపోతే “నాన్నాలి శపథం” కబుల్లు వినండి). అవి లెండూ ఇంకొన్ని లోజులకి కుంచెం పెద్దయ్యాయి. అంతే నా అంతన్నమాత. అప్పుడప్పులు చిన్నిచిన్ని పాదాలతో నడుచుకుంతూ వచ్చి నన్ను పలకలిస్తాయి. కానీ వాతికి మా నాన్నాలంతే బయ్యం. అందుకే లోపలికి మాత్లం లావు. గుమ్మంలోంచే అన్నీనూ.
వాతికి నాతో కబుల్లు చెప్పాలంతే ఎంతిష్తమో. వాళ్ళ అమ్మ ఎక్కడెక్కడో తిరిగొచ్చి చెప్పిన కబుల్లన్నీ నాకు చెబుతాయి. నేను చెబుతానంతే నేను చెబుతానని హడావుడి పడిపోతాయి. అప్పలికీ నేను సద్దిచెప్తానా. కానీ నేనెవలితో మాత్లాడుతున్నానో తెలియక తికమకపడిపోతాయి. అంతే అవి లెండు పావులాలు కదా. లెండూ ఒకేలా ఉంతాయి, మాత్లాడతాయి. ఎలారా బాబూ అని చాలా ఆలోచించాను. అమ్మ నాకు ఆంఆం పెత్తడానికి వచ్చినప్పుడు నా అవస్థ చూసి ఓలా నవ్వింది. నాన్నాలు ఏమీ తోచక, ఆలోచిస్తోంతే కూడా అల్లా నవ్వడం చూశా. అంతే అప్పుడేంచేయాలో అమ్మకి తెలిసిపోయిందని అర్థం. ఆ చిన్నపావులాలకి అమ్మ చిత్తి, పొత్తి అని పేల్లు పెత్తింది. అంతే అవి ముద్దుపేల్లుత. నాకు బాగా నచ్చేశాయి. అప్పతినుంచి మా కబుల్లలో తికమకలేనేలేదు. ఓస్. ఇందుకా పెద్దాళ్ళందలికీ ఒఖ్ఖో పేలుంతుందీ, అని నాకు తెలిసిపోయింది.
నిన్న చిత్తి పేద్ద కబులు మోసుకొచ్చింది. ఈ మధ్య అన్నింతిలోనూ బాగా కల్తీ జలుగుతోందిత. అంతే ఏమితోకూడా చెప్పింది. బియ్యం ఉన్నాయా. తిందామనుకొని నోత్లో పెత్తుకుంతే, నోలు బాగా నెప్పెత్తిందిత. ఏంతబ్బా అని చూస్తే, బియ్యంలాగా ఉన్న లాయిత. నోత్లో గుచ్చుకుని, బాగా నెప్పెత్తిందిత. ఒకదానిలో ఇంకోదాన్ని కలిపి, దాని బలాన్ని తగ్గించేయడమే కల్తీ అని కూడా చెప్పిందనుకో. నాక్కొంచెం తికమకగా అనిపించినా, తెలిసిపోయింది. అమ్మనాకు పింకు సిలప్ తాగించేతప్పుడు నీళ్ళు కలుపుతుందిగా. అదన్నమాత కల్తీ అంతే.
ఇవాళ పొద్దున్నే పొత్తి నెమ్మిదిగా వచ్చి గడపమీద విచాలంగా కూచుంది. ఏమైందీ అనడిగానా. “చిత్తికి బాగా పొగలు”, అంది. “అంతే?” అనడిగాను. “పొగలంతే గల్వం. అంతే నన్ను తీసిపడేయడం” అంది. నాకేమీ తెలీలేదు. ఇంకాబాగా చెప్పూ అన్నాను. వాళ్ళమ్మదగ్గల ఎప్పుడూ చిత్తే ఉండాలనుకుంతోందిత. ఆంఆంకూడా ఎక్కువ అదే తినేస్తోందిత. దాలాగాలం అంతా నాదేనని, పొత్తిని ఓ మూలకి తోసేసిందిత. పాపాయి కదా అని అస్సలు ప్లేమగానే చూస్కోవత్లేదుత. పాపం జాలేసింది. ఏంచెయ్యాలో నేనాలోచించి చెప్తాలే అన్నాను.
ఈలోగా లాత్లయిపోయింది. నేనేమో నాకాలు నోత్లోపెత్తుకుని ఒకతే ఆలోచిస్తున్నాను. అలా అయితే నాకు బలేమంచి ఆలోచనలొస్తాయిలే. ఈలోగా, అమ్మేమో ఆంఆంతిను. మంచినీళ్ళుతాగు అని ఒకతే గొడవ. విసుగొచ్చి కాలు బలంగా విదిలించానా. అంతే దెబ్బకి అమ్మచేతిలో మంచినీళ్ళ వెండిగిన్నెకిందపడిపోయింది. నా ఒళ్ళంతా నీళ్ళే. బాగా చలేసేసిందనుకో. అమ్మకి కోపం వచ్చేస్తుంది, మలి నేను పొగలు చూపించాను కదా అనుకుంతున్నాను. కానీ, అమ్మ వెంఠనే నన్ను దగ్గలకు తీసుకుని, వేలే బత్తలు వేసేసి, ముద్దు పెత్తుకుంది. నా పొగలంతా తగ్గిపోయింది. హాయిగా అనిపించింది. అప్పుడే ఠక్కున పొత్తికి ఏంచెప్పాలో తెలిసిపోయింది.
పొగలుని ప్లేమతో కల్తీ చెయ్యాలి. అంతే చిత్తిమీద ఇంకా ప్లేమ చూపించాలి. అప్పులే చిత్తి పొగలు తగ్గిపోతుంది.
పొద్దున్నయితేగానీ పొత్తికీవిషయం చెప్పడానికి లేదు. నేను బజ్జుంతేగానీ పొద్దున్నవదు కదా అని బజ్జుండిపోయాను.
So sweet! ఎంత బాగున్నాయో మీ బంగారు తల్లి కబుర్లు. ఎంత ముద్దొచ్చేస్తోందో ఫోటోల్లో.. 🙂
వ్యాఖ్య ద్వారా మధురవాణి — జూన్ 9, 2010 @ 1:43 సా. |
అంతా అమ్మ పోలికే :-). థాంక్యూ.
వ్యాఖ్య ద్వారా బంగారుతల్లి — జూన్ 9, 2010 @ 3:14 సా. |