బంగారుతల్లి కబుర్లు

జూన్ 4, 2010

అమ్మ ఐలోపా ప్లయాణం ఖద

Filed under: కుటుంబం — బంగారుతల్లి @ 5:09 సా.

అంతే ఈ ఖద నేను పుత్తక ముందుదన్నమాత.  అప్పులు అమ్మకి నాన్నాలెవలో అంతగా తెలీదుకదా.  అప్పులు నాన్నాలు లండన్లో ఉండేవాలన్నమాత.  అమ్మేమో బెజవాడలో.  అమ్మకేమో బెజవాడలో ఉండీ ఉండీ బోల్ కొత్తేసింది.  కొన్నాళ్ళు లండన్, అమెలికా, పాలిస్ చూసొద్దామనుకొంది. ఈలోగా నాన్నాలితో పెళ్ళికుదిరింది.  పెళ్ళంతే నీకుతెలుసుగా.  నాకు తెలీదులే.  అప్పులు అమ్మ బాగా గంతులేసిందిత.  అమ్మమ్మ చెప్పిందిలే.

ఒకసాలి అమ్మకి జొలం వస్తే పాపం పలకలిద్దామని చెప్పాపెత్తకుండా నాన్నాలు ఒక్కసాలిగా బెజవాడ వచ్చేసాలా.  వినాయకచవితి లోజన్నమాత.  అప్పులు అమ్మకి వెంఠనే నయమైపోయిందిత.  అప్పులు నాన్నాలు, అమ్మా బెజవాడంతా మాదేలాజ్యం అన్నత్తు తిలిగేసాలుత.  మళ్ళీ లండన్ వెళ్ళేముందు, “నువ్వు ఎలాగూ పెళ్ళయిపోయాకా అక్కడికే వస్తావుగా.  మళ్ళీ అన్ని సామాను మోసుకులాలేవు.  కొన్ని నాకిచ్చేయి, పత్తుకుపోతా” అన్నాలని, అమ్మ తన బత్తలన్నీ ఒక క్కొత్త పెత్తిలో సద్ది, నాన్నాలికి ఇచ్చిందిత.  అది పత్తుకుని నాన్నాలు వెళ్ళిపోయాలు.

మళ్ళీ నలభైలోజుల్లో అదే పెత్తి పత్తుకుని వెనక్కి వచ్చేసాలుత.  ఆయన డబ్బాలు కాపలా కాసే ఉద్యోగం, అదేనమ్మా, కంపూతలో, ఏదో, లండన్ నించి బెంగుళూలికి మాలిపోయిందిత.  “బెంగుళులంతే బెజవాడ కాదుగా.  కుంచెం చల్లగానే ఉంతుందిలే.  కొన్నాళ్ళుండొచ్చు” అనుకోని అమ్మ సంతోషంగా బెంగుళూలు వచ్చేసిందిత.

బాగా సంతోషం వేసింది

బాగా సంతోషం వేసింది

ఓ అలవై నెల్ల తల్వాత నాన్నాలు ఉద్యోగం వేలే చోతికి మాలిపోయాలుత.  వీళ్ళు నాన్నాలిని డబ్లిన్ (అదెక్కడో కూడా నాకు తెలీదు మలి)  పంపిస్తామన్నాలుత.  ఆహా, బలే బలే అని అమ్మనికూడా తీసుకెళ్దామనుకున్నాలుత.  అప్పులు వీసాలిచ్చేవాడు అమ్మ పేద్దచదువులని చూసి, కళ్ళుతిలిగి కిందపడి, లేచి, ఇప్పుడు వెళ్తే మళ్ళీ వెనక్కు లాదేమోనని బయ్యంపడిపోయి, వద్దులే అన్నాడుత.  అలా ప్పదిస్సాల్లు వద్దనేసలికి, అమ్మకింక విసుగొచ్చి నాకీ బెంగుళులే బాగుందని ఇక్కడే ఉండిపోయిందిత.

ఈలోగా నేను పుత్తేశాను.  మొన్న నాన్నాలు సింగపూల్ వెళ్దామా అని అడిగితే, మొదత బలేబలే అందా.  తల్వాత తీలిగ్గా ఆలోచించి, “వద్దులెండి, అక్కడ శాంతమ్ముండదు.  కష్తం” అనేసింది అమ్మ.  శాంతమ్మంతే అంతిష్తం. (శాంతమ్మెవలో తెలియదా?  రేపుచెప్పానే, శాంతమ్మజెడ గులించి.  ఆ కబుల్లు చదవండి)

నాన్నాలు ఈ ఖదచెప్తూంతే బజ్జుండిపోయాకదా.  అప్పులు నాకో మాంచ్చి కలొచ్చింది.  కలలో నేను కుంచెం పెద్దయ్యాకా, ప్లధానమంత్లి అయిపోయానుత.  అప్పులు అమ్మని, నాన్నాలిని ప్పది ఊళ్ళూ తిప్పుతున్నానుత.  లండన్, అమెలికా, అమలాపులం, పాలిస్, మైసూలు, ఇలా అన్నీనన్నమాత.  అప్పుడు అమ్మకి ఎక్కడనచ్చితే అక్కడ మంచిఇల్లు కొనేసి, అక్కడే ఉండిపోతాం.  శాంతమ్మని కూడా తీసుకెళ్ళాలే.

నాకు బాగా సంతోషం వేసింది.

8 వ్యాఖ్యలు »

 1. మీ బుజ్జమ్మ ముద్దుగా గులాబి మొగ్గలా ఉంది 🙂

  వ్యాఖ్య ద్వారా రాణి — జూన్ 4, 2010 @ 7:41 సా. | స్పందించండి

 2. just saw this blog today and finished all posts in one shot. EXCELLENT !!!!

  వ్యాఖ్య ద్వారా మంచు — జూన్ 4, 2010 @ 8:48 సా. | స్పందించండి

 3. Bangaaru talli blog nijamgaa bangaaram. 🙂
  Bangaaru talli nijam gaa pradhaana mantri aitee? 😉

  వ్యాఖ్య ద్వారా Chandu — జూన్ 4, 2010 @ 10:55 సా. | స్పందించండి

 4. 🙂 chaalaa baagunnayi kaburlu

  వ్యాఖ్య ద్వారా nestam — జూన్ 8, 2010 @ 10:59 ఉద. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.

%d bloggers like this: