బంగారుతల్లి కబుర్లు

జూన్ 3, 2010

నాన్నాలు, అమ్మ ఈ మధ్యనే తెలుగువాళ్ళయ్యాలు

Filed under: కుటుంబం — బంగారుతల్లి @ 1:00 సా.

నాన్నాలు, అమ్మ ఈ మధ్యనే తెలుగువాళ్ళయ్యాలుత. అంతే ఏంతని అడిగానా. నాన్నాలు ఇలా చెప్పుకొచ్చాలు.

తెలుగువాళ్ళంతే కొన్ని పద్ధతులుండాలిత.

ఒకతి. ఆవకాయ, గోంగూల ప్లాణమై ఉండాలి.
మలోతి. బెంగుళూలులో ఉన్నాంకదా. మలి మనవాళ్ళెవలైనా కనిపిస్తే, ఇంగ్లీషులో మాత్తాడేయాలి.
ఇంకోతి. సినీమాలు బాగాచూడాలి. వచ్చిన ప్లతీ సినిమా, మంచిదైతే సలే, పిచ్చిదైతే, అదెందుకు పిచ్చిదో చూసి కనిపెత్తేయాలి.

మొదతిది సలే. అమ్మకీ, నాన్నాలికీ ఆవకాయ, గోంగూలా, లెండూ చ్చాలా యిష్తం. అమ్మ వెల్లుల్లి ఆవకాయ, గోంగూలపచ్చడిలోకి వండని ఉల్లిపాయా నంచుకుంతూ, “ఆహా. స్వర్గం. ఓహో” అంతూ, ఒకవైపు నాన్నాలిమీద జాలిపడుతుంది. అంతే నాన్నాలు ఉల్లిపాయ తినలు కదా. అందుకనన్నమాత.

మలోతి కుంచెం కష్తం. అంతే నాన్నాలికి తెలుగంతే ఇష్తం కదా! ఎప్పులూ మల్చిపోయి తెలుగులో మాత్లాడేస్తాలు. అప్పులు అవతలివాళ్ళు ఇంగ్లీషులో ఖోప్పడితే, లెంపలేసుకుంతాలు. ముఖ్యంగా ఆఫీసులో తెలుగువాళ్ళంతా అంతేత. నాతో చెప్పుకుని కుంచెం భాద పడ్డాలులే.

హాల్లో, స్పెషల్ పక్కమీద నేనే

హాల్లో, స్పెషల్ పక్కమీద నేనే

కానీ ఇంకోతే చ్చాలా ఖష్తం. మలి చ్చాలా లోజులు నేను అమ్మబొజ్జలో ఉన్నానా. అంతే ప్పది లోజులో, నలభై నెల్లో నన్నమాత. అందుకని పాపం సినిమాలు చూసి చాలా చాలా లోజులయ్యిందిత. అందుకని నాన్నాలు ఒక కొత్త ఆలోచన చేసాలు. వాడెవడో ఎల్లచొక్కా వాడికి అప్పిచ్చాలు. వాడికి వింతపేలేదో ఉంది, బిగ్ ఫ్లిక్సో మలోతో. వాడేమో నాన్నాలికి నిజ్జం డబ్బుల బదులు సినిమాలిస్తాడన్నమాత. వాడికెంత ఓపికో. లోజూ వస్తాడు. సినిమాలు పత్తుకుని. నేను ఆంఆం తినేసాకా బుజ్జుంతానా. అప్పుడొచ్చి ఠాంగుమని మా బెల్లు కొత్తి, సినిమాలు అమ్మకిచ్చి పాలిపోతాడు. అంతే, మొన్న నన్ను బజ్జోకుండా లేపేస్తున్నాడని వాడిమీద గత్తిగా అలిచి, ప్రైవేతు చెప్పేసాన్లే. అందుకని వాడికి నేనంతే బయ్యం.

ఇంక లోజూ నన్ను బజ్జోపెత్తేసి, హాల్లో సినిమాలు చూసేసేవాళ్ళు. ఒకలోజు మధ్యలో లేచిచూద్దును కదా. పక్కనే అమ్మకనిపించలేదు. బలే బయ్యమైందనుకో. అప్పులు గాఠిగా అలిచేసానా. అంతే ఒక్క గెంతులో అమ్మ నాదగ్గలకొచ్చేసింది. అప్పులు చెప్పాను. అమ్మా, నేను కూడా తెలుగుపాపాయినవ్వాలి కదా. నన్నూ నీతో తీసుకెళ్ళూ అని. పాపం జాలిపడి, నాన్నాలితో చెప్పి, నాకోసం హాల్లో స్పెషల్గా మంచి పక్క వేయించింది.

అలా వాళ్ళతో సినిమాలు చూస్తూ, నేను కూడా తెలుగమ్మాయినయ్యానోచ్.

4 వ్యాఖ్యలు »

  1. Very nice. Mee ammaayi chaalaa muddu gaa maatlaadutondi. 🙂 Appude blogging koodaa chestondanna maata! 🙂
    Mee Bangaaru Talli nijam gaa bangaaru telle.

    Chandu

    వ్యాఖ్య ద్వారా Chandu — జూన్ 3, 2010 @ 10:50 సా. | స్పందించండి

  2. మీ ఆలోచన చాలా బావుంది. మీ పాప పెద్దయ్యాక ఇవన్ని చూసుకుని చాలా సంతోషంతో గర్వపడుతుంది:)

    వ్యాఖ్య ద్వారా Sai Praveen — జూన్ 4, 2010 @ 3:04 ఉద. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.

%d bloggers like this: