ఈవేసవికాలమంతా అమ్మకి సినిమా కష్తాలుత. లాజిఅత్తతో చెపుతోంతే విన్నాను. అంతే ఏంత్లా? అని బుడుగుకి ఫోన్ చేసానా. వాడిలా చెప్పాడు.
జత్కాతోలినప్పుడు కావాలికదా అని దాచుకున్నబీడీలు నాన్న లాగేసుకోవడం, ఎంత ఏడిపించినా ఝడుసుకోకుండా, ఒక్కడే మాస్తాలు మనదగ్గల ఉద్యోగంచేయతం, ఎప్పుడూ మన్ని కాపాడే బామ్మ ఊరెళ్ళడం, అప్పుడే రాధాగోపాళాలు ఒకళ్ళకొకళ్ళు గాఠిగా ప్రైవేతు చెప్పేసుకోవడం, రెండుజెళ్ళసీత గురించి గోపాలంతో చెప్పానని బాబాయి మన నెత్తిమీద ఓ తెంకిజెల్ల ఇచ్చుకోవడం – అబ్బో, ఇలా చాలా ఒక్కేసాలి జలిగిపోతూంతే, వాతిని సినిమాకష్తాలంతాలని చెప్పాడు కదా.
మల్నాడంతా నిఘావేసి, అమ్మ కష్తాలు తెలిసేసుకొని, అమ్మని రష్చించేయాలని అనేసుకున్నా. అందుకే, పొద్దున్నేలేచేసా.
శాంతమ్మ లాలేదుత. అమ్మమొహంలో ఎంత విచాలమో! ఇల్లంతా తుడుచుకోవాలిత. పిచ్చిఅమ్మ. నన్ను కిందపడుకోబెడితే, డెబ్బైనిమిషాలలో ఇల్లంతా దొల్లేసి, శుభ్రం చేసేస్తాను కదా. అది కూడా తెలీదు. అంత్లు తోముకోవాలిత. అంతే నాకు తెలీలేదు కానీ, అదేదో ఆంఆం కి సంబంధించిందై ఉంతుందని ఊహించా. కానీ, అవి తోముకోవడమెందుకో నాకు తెలీలేదు. పాలు కూడా లాలేదుత. ఇది చాలా వీజీ. అందలికీ నా సీసాపాలు ఇచ్చేత్తే సలి. అప్పులు సమస్యలేదుగా. అంత్లుకూడా తోముకోక్కల్లేదు.
వాషింగ్ మెషీన్ పాడయ్యిందిత. అందుకని బత్తలు ఉతుక్కోవాలిత. ఇదీ చిన్న విషయమే. బత్తలన్నీ మా నీళ్ళగదిలో బుత్తలో వేసేస్తే సలి. నా బత్తలు అలాగే చేత్తుంది అమ్మ. ఇవాళ వేసిన బత్తలు, నిన్నతికల్లా తెల్లగా తయాలైపోతాయి. అలాగే అందలి బత్తలూ వేసేస్తే సలి. నాన్నాలికైనా ఇది తెలియాలికదా. అంతేలే. పెద్దాళ్ళయితే ఇలాగే చిన్నచిన్న విషయాలుకూడా మల్చిపోతాలు.
కలెంతు లేదుత. బజ్జోడం కష్తంత. పాపం అమ్మ ఈ పనులన్నీ ఎలా చేసుకోవాలో తెలియక తికమకపడుతోంది కదా. అందుకని అమ్మకి ఇవాళ నేనే జోల పాడేస్తా (లగాన్ సినిమాలో “ఓ పాలన్ హాలే” పాతనే జోల అంతాలు). అప్పులు అమ్మ హాయిగా బజ్జుంతుంది.
హు. ఇవీ ఒక కష్తాలేనా. కష్తాలంతే చెబుతా వినండి. నాన్నాలి కళ్ళజోడు పత్తుకోవడం, బాత్ తబ్బులో నీళ్ళు గుప్పెత్లో పత్తుకోవడం, నాన్నాలు గాఠిగా ముద్దుపెత్తుకున్నప్పుడు గెడ్డం గుచ్చుకుని నెప్పెత్తినా నవ్వడం, బొత్తుని చెలుపుకోకుండాఉండడం, ఒకచోత కుదురుగా పడుకోవడం – ఇవీ కష్తాలంతే. పెద్దాళ్ళేగానీ, అప్పులప్పులు వీళ్ళకేమీతెలీదు, పాపం.
🙂 🙂 అవును రా బంగారు తల్లి పెద్దాళ్ళం అయ్యేక పెద్ద కష్టాలు మర్చి పోయి చిన్న వాటీనే కష్టాలనుకుంటాము. అమ్మమ్మో ఎంత కష్టం నీళ్ళను గుప్పెటలో మూయటం. 🙂
బాగా రాసేరు పిల్లల తరుపున.
వ్యాఖ్య ద్వారా భావన — జూన్ 4, 2010 @ 1:44 ఉద. |
మీకు మా బంగారుతల్లి కబుర్లు నచ్చినందుకు చాలా సంతోషం. మా బంగారుతల్లికే మాటలొస్తే ఎలా ఉంటుందా అని ఒక ఊహ 🙂
వ్యాఖ్య ద్వారా బంగారుతల్లి — జూన్ 4, 2010 @ 10:51 ఉద. |