బంగారుతల్లి కబుర్లు

జూన్ 2, 2010

సీగానపెసూనాంబా.. నీకు శాంతమ్మ జెడ గులించి తెలుసా?

Filed under: దినచర్య — బంగారుతల్లి @ 7:49 సా.

“కున్నియ్యమ్మా” అంతూ వచ్చింది మా శాంతమ్మ.  అంతే నాకు తెలీదుగానీ, నవ్వేస్తాను.  బావున్నావా అని పలకలిస్తాను.  అప్పులు ఆమెకెంత ఆనందమో.

అయ్యో! ఇంతకీ శాంతమ్మ ఎవలో చెప్పలేదు కదూ.  పెద్దదాన్నవుతున్నాకదా. కుంచెం విషయాలు మల్చిపోతున్నానులా ఉంది.  శాంతమ్మ దగ్గల నాన్నాలు అప్పు తీసుకున్నాలల్లే ఉంది.  వాలానికో, నలభై లోజులకో నిజం డబ్బులిస్తున్నాలా.  అంతే ఆయనివ్వలూ.  నాన్నాలు అమ్మకిస్తే, అమ్మ శాంతమ్మకిస్తుందన్నమాత.  మలి ఆ డబ్బులు తీసుకుని హాయిగా డెబ్బై లోజులకోసాలి వస్తే చాలుకదా.  కానీ ఎందుకో పాపం, శాంతమ్మ లోజూ మా ఇంతికి వస్తూనే ఉంతుంది.  వచ్చింది ఊలికే ఉండదుకదా!  మా ఇల్లంతా శుభ్రంచేసి, మా మత్తి బట్టలు మల్లెపూవుల్లా చేసి (మల్లెపూలంతే, మొన్న అమ్మమ్మ కొంతే, అమ్మ జెళ్ళో పెత్తుకంది చూడు, అవన్నమాత – తెల్లగాఉంతాయిగా), అన్నం గిన్నెలు అచ్చు అన్నంవండకముందులాగా చేసేస్తుంది.  బలేగా మాయగా ఉంతుందిలే.

ఉత్తినే.. బజ్జున్నత్తన్నమాత!

ఉత్తినే.. బజ్జున్నత్తన్నమాత!

శాంతమ్మకి మా మాతలు లావు.  ఏదో, వేలే మాతలు మాత్లాడుతుంది.  నాన్నాలు చెప్పాలు, తమిళంత.  అదేమో అమ్మకీ నాన్నాలికీ లాదు.  బెంగుళూలులో మామాతలు మాత్లాడేవాళ్ళు తక్కువుత.  అందుకుని అమ్మ శాంతమ్మతో వచ్చీలాని మాతలు చెప్తోంతే నవ్వువచ్చేస్తుందనుకో.  అలా ఇన్ని మాతలెందుకో.  అన్ని మనుషులికీ ఒకే మాతలుండచ్చు కదమ్మా!  అప్పుడు మా పిల్లలకెంత హాయి.  అలా ఎందుక్కాదో ఈసాలి బుడుగునడగాలి.

పొద్దున్నే మా గదిలోకి అలా శాంతమ్మలాగానే, ఇలా గదినించి నన్ను తీసుకు బయతకు పలిగెత్తుతాలు.  ఎందుకో తెలీదు కానీ.  నాన్నాలిని చాలాసాల్లు అడుగుదామనుకొన్నా.  కానీ అలోచిస్తే నాకు కుంచెం ఖోపం వచ్చింది, నాకు వాళ్ళు అప్పుడే చెప్పనందుకు.  నేనూ పెద్దదాన్నవుతున్నాగా, నేనే తెలుసుకుందామని ఓ ఉపాయం ఆలోచించా.

ఇంకోలోజు శాంతమ్మ మాగదిలోకి వచ్చినప్పులు, నేను గాఠిగా కళ్ళు మూసేసుకున్నా.  పాపం.  పిచ్చి అమ్మ.  నేను బజ్జున్నాననుకొని, శాంతమ్మతో, “ఉష్!  నెమ్మదిగా!!” అంది.  నామీద అమెలికా లాజీ అత్త పంపిన పింకు దుప్పతి కప్పింది.  నాకు నవ్వొచ్చేసిందనుకో.  ఆపుకొని మెల్లిగా కళ్ళుతెలిచి చూశా.

హాచ్చెర్యం....

హాచ్చెర్యం....

హాచ్చెర్యం.

శాంతమ్మకి ఒక చేతిలో పొడుగాతి జెడ, పళ్ళెం మలోచేతిలో పత్తుకుని వుంది.  అమ్మకి జెడ బుల్లమీదకదా ఉందీ, శాంతమ్మకేంతీ, చేతిలో ఉందీ అని ఆలోచిస్తున్నానా.  ఇంతలో శాంతమ్మ ఆ పొడూగు జెడని నేలమీద లాయడం మొదలుపెత్తింది.  గదంతా అల్లా లాసి, లాసి, చివల్లో, పళ్ళానికేసి కూడా లాసింది.  ఎందుకో.  నాకైతే తెలీలేదమ్మా.  ఈలోగా అమ్మ లావతం చూసి, మళ్ళీ గాఠిగా కళ్ళు మూసేసుకున్నా.  కానీ అమ్మ చూసేసింది.  “దొంగా.  అప్పులే లేచిపోయావా” అని దగ్గలకొచ్చి ఎత్తుకుని ముద్దుపెత్తేసుకుంది.  నేను నవ్వేలోగా అమ్మ ఓమూల చూసి, “శాంతమ్మా!  ఆ చీపులు ఇలా పత్లా!  ఇక్కడంతా దుమ్ము దుమ్ము” అని అలిచింది.  శాంతమ్మేమో మళ్ళీ ఆ పొడుగాతి జెడ తెచ్చుకొచ్చి, నేలమీద లాయతం మొదలు పెత్తింది!!

అప్పులు తెలిసింది.

శాంతమ్మ తన జెడతో నేలమీద లాస్తోంతే, నా మీద దుమ్ముపడకుండా, నన్నెత్తుకుని పలిగెత్తుతున్నాలన్నమాత. ఇంకో విషయం కూడా తెలిసిపోయింది. బుల్లమీదుంతే “జెడ” అంతాలు, చేతిలో ఉంతే ““చీపులు” అంతాలు.

ఏమైనా, ఈ పెద్దాళ్ళు మాతిమాతికి పేల్లు మార్చేస్తోంతే పిల్లలకెంత కష్టం?  ఎదో, తెలివైనదాన్ని కాబత్తి నాకు తెలిసిపోయిందిగానీ.  అన్నత్తు సీగానపెసూనాంబకి ఇది తెలుసోలేదో.  ఈసాలి కలిసినప్పులు చెప్పాలి.

3 వ్యాఖ్యలు »

 1. బావుందండి.ఫోటోలు ఇంకా ముచ్చటగా ఉన్నాయి

  వ్యాఖ్య ద్వారా బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ — జూన్ 2, 2010 @ 10:18 సా. | స్పందించండి

 2. Your narration and your baby both are very cute…

  వ్యాఖ్య ద్వారా స్ఫురిత — జూన్ 3, 2010 @ 7:20 సా. | స్పందించండి

 3. @Sreekanth: మీకు మా బంగారుతల్లి ఫొటోలు నచ్చినందుకు సంతోషం.
  @స్పురిత: Thank you so much for your feedback.

  వ్యాఖ్య ద్వారా బంగారుతల్లి — జూన్ 9, 2010 @ 3:51 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.

%d bloggers like this: