బంగారుతల్లి కబుర్లు

జూన్ 1, 2010

నాన్నాలి శపథం (శపథం అంతే ప్లతిఙ్ఞ. అంతే నాకు తెలీదు)

Filed under: కుటుంబం — బంగారుతల్లి @ 1:15 ఉద.

నాన్నాలికి కుంచెం బద్ధకం ఎక్కువత.  అమ్మ నాన్నాలిని “లేజీ బోన్స్” అంతోంతే అప్పులప్పుడు విన్నాలెండి.  అంతే  ఏమితో నాకు తెలీదు కానీ ఎందుకలా అందో చెప్పమని అడిగా.  అప్పులు అమ్మ చెప్పిన కథ ఇది.

మలి నాన్నాలు ఇంకో జన్మలో జేజి దగ్గల కాపలాకాసేవాలుత.  ఆయన్ను అందలూ “జయుడూ” అని పిలిచేవాలుత.  కాపలా అంతే నుంచోవాలి కదా!  అప్పులు నుంచుని నుంచుని, కాళ్ళు బాగానెప్పెత్తాయిత.  డెబ్బై లోజుల తల్వాత జేజికి నాన్నాలి పని బాగా నచ్చి వలం కోలుకో అన్నాలుత.  వలం అంతే నేను బాగా నవ్వినప్పులు నాన్నాలు ఏనుగు బొమ్మ కొనిస్తాలు చూడు.  అదన్నమాత.  అప్పులు నాన్నాలు జేజీ, జేజీ, నాకు నుంచుని నుంచునీ కాళ్ళు లాగుతున్నాయీ, కూచునేలా ఏదైనా చెయ్యీ అన్నాలుత.  జేజి బాగా అలోచించుకో అన్నాలా.  నాన్నాలు తప్పదూ, నాకు ఈ వలమే కావాలీ అన్నాలుత.  జేజి నవ్వి సలే అన్నాలుత.

అప్పులు ఈ జన్మలో నాన్నాలు చదువైపోయాకా ఉద్యోగానికి కుదులుకున్నాలా.  అది డబ్బాల్ని (అదే, కంప్యూతలో, ఏదో అంతాలుగా) కాపలాకాసే ఉద్యోగం అన్నమాత.  చక్కగా ఎప్పులూ నుంచోక్కల్లేదు.  కూచునే కాపలాకాయాలి.  అయితే ఈసాలి కూచునికూచునీ, నాన్నాలు తొండంలేని వినాయకుడయ్యాలుత.  అమ్మ అలానే చెప్పిందిలే.  చెప్పి నవ్వింది.  అబ్బ.  అమ్మ నవ్వు ఎంత బాంతుందో.  అప్పులు నాన్నాలికి అనుమానం వేసి, ప్పదో, డెబ్బయ్యో కిలోలు తగ్గుతానని శపథం చేసాలుత.  శపథం అంతే ప్లతిఙ్ఞ. అంతే నాకు తెలీదు.  అప్పలికి నేనింకా అమ్మ బొజ్జలో ఉన్నానుగా.  అందుకన్నమాత.

నాన్నాలికిద్దలు స్నేహితులున్నాలు కదా.  అంతే నాకు సీగానపెసూనాంబ, బుడుగులానన్నమాత.  వాళ్ళుచెప్పినత్తు విని, ఆంఆం తిండం మానేసాలుత.  ప్పది గంతల తల్వాత ఇంకా బాగా ఆకలేసి, వాళ్ళిద్దరి ఆంఆం కూడా నాన్నాలే తినేసేవాలుత.  అప్పుడు వాళ్ళు నాన్నాలిని ఇది వద్దులే, సైకిల్ తొక్కూ అని బతిమాలుకున్నాలు.  అప్పులు నాన్నాలు సైకిలు తొక్కి తొక్కి ఆఫీసుకెళ్ళేసరికి, బాసుగాడు నాన్నాలి పనంతా ఆ ఇద్దలి చేతా చేయించేసాడా. వాళ్లిద్దలూ నాన్నాలికి గాఠిగా ప్రైవేతు చెప్పేసాలుత.  అప్పులు నాన్నాలు అమ్మని నేనేంచెయ్యాలో నవ్వకుండా చెప్పూ అన్నాలుత.  అప్పులు అమ్మ నవ్వు ఆపుకొని, త్రెడ్మిల్లు కొనుక్కుందాం, అదయితే నేనూ నడుస్తాను అందికదా.  అప్పులు వెంతనే నాన్నాలు కొత్తువాడికి ఉత్తుత్తి డబ్బులిచ్చేసి కొనుక్కొచ్చేసాలుత. నాన్నాలిలాగా డబ్బాల్ని కాపలాకాసేవాళ్ళ దగ్గల బోళ్ళు ఉత్తుత్తి డబ్బులుంతాయితగా? బుడుగు చెప్పాడు.  వాతికింకో వింత పేలు క్లెడిత్ కాల్డులుత.

దాలాగాలం కొన్నాలా.  ఇది కూడా బుడుగే చెప్పాడు.  త్రెడ్ అంతే మన మాతల్లో దాలం.  మిల్ అంతే కల్మాగాలం.  కలిపితే, దాలాగాలం అన్నమాత.  అబ్బో, నాకు చాల తెలిసిపోతున్నాయి.  మరి పెద్దదాన్నవ్వాలికదా.

అలవై లోజులు నడిచేసలికి  అలికాళ్ళు నెప్పెత్తి, బూత్లు కొన్నాలు.  మలో ప్పది లోజులకి బోల్ కొత్తి, పాతలు వినే చిన్నడబ్బా కొన్నాలు.  మానాన్నాలి దగ్గల బోళ్ళు ఉత్తుత్తి డబ్బులోచ్.  డబ్బయ్యోలోజుకి గదిలో ఊపిలి ఆడక, దాలాగాలాన్ని బాల్కనీలో పెత్తించాలు.  నలభైయ్యోలోజుకి కాళ్ళు బాగా పీకాయి.  ఇన్ని డబ్బులుపెత్తి కొన్నాంకదా.  నడవకపోతే ఏంచేద్దాం అని ఆలోచిస్తూండగా, నాన్నాలి ముందు ఓ పావురం కూచుంది.  నాన్నాలికి ఓ ఉత్తలం ఇచ్చిందిగామోసు.  అది ఇంకో జన్మలో నాన్నాలి ఫ్రెండ్, జేజి దగ్గల పనిచేసే గలుత్మంతుడిది.  “జయుడూ జయుడూ (అంతే, నాన్నాలి పేలు అప్పులు అదే కదా మలి).  ఈ ఉత్తలం తెచ్చిన పావులం ఐదలాబాదుది.  ఇక్కడ లైలా తుఫాను తల్వాత బాగా ఎండలుత. బేంగుళూల్లో  వానలుత కదా! దానిబొజ్జలో బుజ్జి బంగాలుతల్లి ఉన్నాయి. నువ్వు ఖాళీ చూపిస్తేచాలు.  అది ఇల్లు కత్తేసుకుంతుంది” అని.

నాన్నాలికి బాగా జాలివేసేసింది.  మలి నేస్తమంతే అడిగింది చెయ్యాలి కదా.  అడిగితే బుడుక్కి సీగానపెసూనాంబ కభాష నేల్పిందా లేదా.  నువ్వే చెప్పు మలి.  అందుకే నాన్నాలు “పావులం పావులం.  ఈ దాలాగాలం మీద నడిచీ నడిచీ నాకాళ్ళు పీక్కుపోతున్నాయ్.  దీనికన్నా జేజి దగ్గల కాపలాయే బావుంది.  అందుకే, నువ్వు ఇక్కడే ఇల్లు కత్తేసుకో.  మా బంగాలుతల్లీ, సీగానపేసూనాంబా, బుడుగ్గాడూ, ఇస్కాన్ చిన్నాలి కిష్షుడూ ఆకుంతూవుంతాలు. అప్పుడు నీ పిల్లలూ ఆకోచ్చూ” అన్నాలు.  అంతే, అప్పతినుంచీ, మా దాలాగాలం ఇలా వుంది.

దాలాగాలంలో పావులమూ, పిల్లలూను

దాలాగాలంలో పావులమూ, పిల్లలూను

ప్రకటనలు

3 వ్యాఖ్యలు »

  1. hahaha :))

    వ్యాఖ్య ద్వారా nestam — జూన్ 1, 2010 @ 7:12 ఉద. | స్పందించండి

  2. maa intlo kooda same situation. kaneesam 60-70 rojulina vaadaru ,maa intlo adee ledu ,t mill techi 5 yrs ayindi appude.danni varshlu paddappudu battlu aareyyadaniki vadutunnam 🙂

    వ్యాఖ్య ద్వారా priya — జూన్ 1, 2010 @ 11:04 ఉద. | స్పందించండి

  3. So sute! 😀 😀

    వ్యాఖ్య ద్వారా మధురవాణి — జూన్ 2, 2010 @ 2:12 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

%d bloggers like this: