నిన్న అమ్మమ్మ పుత్తినలోజు కదా. అందుకని నాన్నాలు మమ్మల్నందల్నీ ఇస్కాన్ కి తీసుకెళ్ళారా. అప్పులు తైమేమో చాలా అయిపొయిందన్నమాత. గుడి మూసేస్తాలేమో అని ఒకతే పరుగు. నాకేమో చాలా నవ్వొచ్చేసింది. నాఅంత బుజ్జి పాపాయి వస్తోంతే జేజి గుడి ఎక్కడైనా తెరిచేవుంచుతాలు కదా. పాపం. నాన్నాలికి ఈ విషయం చెప్దామని చాలా చూశా. అరిచా. నవ్వా. వినిపించుకోరే! అబ్బే. లాభం లేదు. ఇంకా బాగా త్లైనింగ్ ఇమ్మని అమ్మకి చెప్పాలి.
లాజి అత్త నన్ను ఎత్తుకుని పలుగులు పెడుతూ గుళ్ళోకి పారిపోయిందా. అందలూ నావెనకే వచ్చేసాలు. అంతే నేనే ఫస్తన్నమాత. చేతనవదిన చెప్పింది.
గుళ్ళో చాలా చిత్లం జలిగింది. చ్చాలా మంది జనం ఉన్నాలు కదా. అందుకని ఊలేగింపు జలుగుతోంది (మనం పిల్లలం కదా, ఏం కష్టపడతాంలే అని జాలిపడి, జేజే మనదగ్గలకొస్తే, దాన్ని ఊలేగింపు అంతాలని బామ్మగాలు చెప్పాలులే). క్కొంతమంది ఉన్నారా, వాళ్ళకి బుర్ర అంతా జుత్తు లేదు. వెనకాతల క్కొంచెమే ఉంది. వాళ్ళేమో “హలే లామ, హలే క్లిష్ణ” అంతూ బలేగా గెంతుతున్నాలు. అప్పులు వాళ్ళ జుత్తు కిందకీ, పైకీ, కిందకీ, పైకీ, ఎగులుతూనే ఉంది. హహహ… నాకు కాస్త నవ్వొచ్చిందిలే. వాళ్ళంత పెద్దాళ్ళయినా, వాళ్ళకన్నా నాకే ఎక్కువ జుత్తుందిగా. అందుకు.
అప్పులు నాన్నాలు నన్ను ఎత్తుకుని క్లిష్షుణ్ణి చూపించాలు. అబ్బ, ఎంత బావున్నాడో! అచ్చు నాలానే ఉన్నాడనిపించింది. అప్పులు నన్ను చూసి నవ్వాడా. నేనూ నవ్వాను. నాన్నాలేమో జేజికి దణ్ణం పెత్తుకోమ్మా బంగాలుతల్లీ అన్నాలు. అబ్బ, మీకేమీ తెలియదు నాన్నాలూ అనికొని, నేను క్లిష్షుడితో అన్నానూ – “క్లిష్షుడూ, క్లిష్షుడూ! నేనేమో సీగానపెసూనాంబనీ, బులుగునీ ఆకోతానికి లమ్మన్నాను. నువ్వు కూడా లా” అని.
అప్పులు నాకు అమ్మ క్కుంచెం ప్లసాదం పెత్తిందిలే. చాలా బాంది. అప్పులు మేమంతా అక్కడే గుళ్ళో కొత్తగా కత్తిన హోతల్కి వెళ్ళాం. అక్కడ వంతల్లో ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఉండవని నాన్నాలు చెప్పాలా. ఇంక అత్త ఒకతే గెంతులు, ఆహా, ఓహూ అంతూ. పాపం, అత్తకి అవి సాయించవుగా అని కొంచెం జాలిపడ్డాలే. లోపలికెళ్ళగానే నాకు చ్చాలా అనందం వేసింది, ఎవ్వలూ లేలు, నాన్నాలు నాకోసం మొత్తం హోతల్ బుక్ చేసాలనుకున్నా. అప్పులు నాన్నాలిని పిలిచి ఒక ముద్దిచ్చా, ఆయనకేమీ అర్థం అయినత్తు లేదు. మల్లీ అమ్మకి చెప్పాలి. త్లైనింగ్ గులించి.
కాసేపయ్యాకా కుంచెం జనం వచ్చాలు. అప్పులు గత్తిగత్తిగా అలిచి చెప్పా, ఇది మా హోతలూ అని. వినిపించుకోరేం! నాకు విసుగొచ్చిందనుకో. అప్పతికీ చాలాసేపు అలిచా. అప్పులు అమ్మ చెప్పింది, “తప్పమ్మా, ఇది కొత్త హోతలు కదా. అందుకే కుంచెం జనం వచ్చాలు. నువ్వు అలా అలవకూడదు” అంది. అప్పులు నాకు బలే కూపం వచ్చింది. నాన్నాలు నాకు ఆంఆం పెత్తడానికి వచ్చాలా, ఒక్క తన్నుతన్నా. ఎందుకో ఎలాగూ అర్థం కాదు కదా. కాని అమ్మమాత్లం కనిపట్టేసింది. నవ్వుతూ నాన్నాలితో విషయం చెప్పింది. అప్పులు నాన్నాలు నన్ను ముద్దుచేస్తూ హోతలంతా తిప్పాలు. అప్పులు నాకు హాయిగా అనిపించి బాగా నవ్వాను. ఇలా…
abhignya, nee maatalu mullapudi vaari stylelo chaala mudduga, gammattuga vunnayi. ilage rooju maaku viseshaalu cheptu vunde. Sarena. Ika vuntaanu.
Anekaaneka Muddulato
Suri Mamayya, Lalitha Atta and Foreign return sriraj bava.
వ్యాఖ్య ద్వారా suri mamayya — మే 27, 2010 @ 4:52 సా. |
ముద్దుగా బాగున్నాడు చిన్ని కృష్ణుడు
వ్యాఖ్య ద్వారా చిలమకూరు విజయమోహన్ — మే 27, 2010 @ 7:01 సా. |
chala bagundi
వ్యాఖ్య ద్వారా ss — జూలై 6, 2010 @ 6:26 సా. |