అక్కా
“నన్ను అక్కా అని పిలిచేది ఎవర్రా?” అని హాచ్చెర్యపోతున్నావా. ఇంకెవరు, నేనే. నాన్నాలి బంగాలుతల్లిని. నీ గులించీ, బుడుగు అల్లరి గులించీ అమ్మ ఆంఆం తినేప్పుడు చెప్పిందిలే. నువ్వు కూడా నాలాగే అందంగా ఉంతావుత. ముద్దుగా నవ్వుతావుత. బోలెడు కబుర్లు చెప్పుతావుత. బులుగుతో కలిసి బలేబలే అల్లరి చేస్తావుత. అంతే, అది అల్లరి కాదూ, ఆడుకోవతం అని నాన్నాలు చెప్పాలనుకో.
సలే మలి. నీకు ఉత్తలం లాయతానకి చాలా ప్పేద్ద కాలణం ఉంది.
మీ ఇద్దలి గులించి విని విని, నాకు కూడా మీతో ఆడుకోవాలని వుంది. అందుక్కే లాస్తున్నాను.
ఒకతి. నాకు పింకు లంగులో ఉండే సిలప్ తాగడం ఇత్తం. లోజూ బజ్జుని లేచాకా అమ్మ నాకు చెంచాతో పోత్తుందా, అది నేను చప్పలిస్తూ తాగుతానన్నమాత. చ్చాల్లా బ్బాగుంతుంది. మనం ఆకునేప్పుడు మీక్కూడా కుంచెం పెత్తమని అమ్మకి చెప్తానే.
మలోతి. అమ్మ నాకు మంచిమంచి బొమ్మలు కొంది. వాతిల్లో బొండాంఏనుగు బలే బాంతుంది. నోత్లో పెత్తుకుని తిన్నాకూడా కరవదు. అది కూడా మీకు చూపిస్తా.
ప్పది. ఇది బులుగుకి చెప్పకు. మనిద్దలి సీక్లెత్. సలేనా? నాన్నాలు నాకోసం బుజ్జి బాత్ తబ్ కొన్నాలు. దాన్లో నీళ్లు నింపి నన్ను కూచోపెడతాలు. అప్పులు నేను నీళ్ల మీద కొత్తుతూ నీళ్లని పత్తుకుంతానా. హాచ్చెర్యం. గుప్పెత తెరిస్తే ఏమీ ఉండవు. ఒత్తు. నిజ్జంగా నిజ్జం. బలేవుంతుందిలే. అది మనిద్దలం ఆడుకొందాం.
డెబ్బై. అమ్మ నన్ను బజ్జోపెత్తతానికి లోజూ “ఓ పాలన్ హాలే” అనే పాత పాడుతుంది. లగాన్ సినిమాలోదిత, నాన్నాలు చెప్పాలు. ఎంత బాంతుందో! నాకు హాయిగా నిద్ల వచ్చేస్తుంది. బజ్జునేస్తాను. మనం అన్ని ఆతలు ఆడేసుకున్నాకా, అమ్మని మీకు కూడా ఆ పాత పాడమందామే. అప్పడు అంతా బజ్జోచ్చు.
సలేనా మలి? నువ్వు ఎప్పుడొస్తావో నాన్నాలికి ఫోన్ చేయి. నిన్ను దగ్గలుండి తీసుకువత్తారు. బులుగుకి కూడా చెప్పు. తీసుకులా.
ఉంతానే
నాన్నాలి బంగాలు తల్లి.
🙂
వ్యాఖ్య ద్వారా రాఘవ — మే 26, 2010 @ 5:29 సా. |
బంగారు తల్లీ భలే బాగున్నాయిరా నీ కబుర్లు…సీగానపెసూనాంబ కి చెల్లివా …మీ అక్కకి నేను పేద్ద విసన కర్రని ,బుడుగుకి కూడా ..ఆ విషయం చెప్పుమరి మర్చిపోకుండా… అలా చూడకు ఇప్పుడు నీకు ఏసీ,కూలర్ రెండూనీ 🙂
వ్యాఖ్య ద్వారా nestam — మే 26, 2010 @ 7:19 సా. |
బలే వున్నయి లా బంగారు తల్లీ నీ కబుర్లు…
వ్యాఖ్య ద్వారా స్ఫురిత — మే 26, 2010 @ 9:38 సా. |
nice narration…!
వ్యాఖ్య ద్వారా kiranteja — మే 27, 2010 @ 3:16 సా. |