మీకు చెప్పానా మా వూలు బెంగలూలు అని? రాజి అత్త, చేతన ఒదిన శెలవులకి మావూలొచ్చాలు. మరి ఖాళీ కదా, బోల్డన్ని ఆతలన్నీ ఆడేసుకున్నాం, నేనూ, వదినాను. అప్పులు బోల్ కొత్తి (ఏమీ తోచకపోవడాన్ని బోల్ అంతాలని అంకితక్క చెప్పిందిలెండి) నాన్నాలి దగ్గల గాలం పొయా. అప్పులు నాన్నాలు మమ్మల్నందరినీ మైసూల్ కి తాతా తీస్కెళ్తానని చెప్పారు. ఇంక ఆనందమే ఆనందం.
ఆ లోజు నాన్నాలు ఆఫీస్ నుంచి గమ్మునొచ్చేశాలు. అమ్మ నన్ను అందంగా లెడీ చేసేసింది. కల్పకం అమ్మమ్మ, సీతాలాం తాతయ్య వచ్చేసాలు. అందరం బయల్దేలిపోయాం. మరి అందరికీ వంతలు వండాలు కదా. అందుకే కల్పకం అమ్మమ్మ దాలిలో ఒక చోత ఆపమంది. హోటల్ వాడు మమ్మల్ని అక్కడ ఉండద్దన్నాడా, అమ్మమ్మ వాడికి ప్రైవే్టు చెప్పేసింది. అంతే. దెబ్బకి భయపడిపోయాడు. అప్పుడు అందరం అక్కడ కూర్చుని ఆం ఆం తినేసాలు. ఫొతో్లు కూడా తీసుకున్నాలు. మలి నాకు కూడా ఆకలేస్తుంది కదా? అందుకే అమ్మ నాకు యమ్మీయమ్ ఇచ్చేసింది.
మైసూలు వెళ్లేసలికి బాగా పొద్దుపోయింది. “లేపు చాలా చూడాలమ్మా, కుషీ, బజ్జోమ్మా బంగారూ” అంది కదా అమ్మ, అందుకే బజ్జున్నా.
నాన్నాలికి నేను బజ్జుంతే ఎంతిష్టమో, ఇలా ఫొతో తీసాలు…
స్పందించండి